రామ్ కోసం అనిరుద్.. ఫహద్?

by Pulgam srinivas |

రామ్ నెక్స్ట్ మూవీలో ఫహద్ ఫాసిల్, అనిరుద్ రవిచందర్ భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.

రామ్ కోసం అనిరుద్.. ఫహద్?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని నెక్స్ట్ మూవీకి సంబంధించిన వార్తలు ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్లో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఈ యంగ్ హీరో తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన లోగి విఘ్నేష్ తో చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి భారీ స్థాయి నటీనటులు, టెక్నీషియన్స్ పనిచేసే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

అందులో భాగంగా పుష్ప చిత్రంతో ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ఫహద్ ఫాసిల్ ఇందులో ప్రతినాయకుడి పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి సంగీతాన్ని యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రామ్ పోతినేని నెక్స్ట్ మూవీ చాలా పెద్ద స్కేల్లో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని సినీ సర్కిల్స్ భావిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో ఉండబోతున్నట్లు సమాచారం.

Next Story