- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"యానిమల్" నుంచి బిగ్ అప్డేట్..సందీప్ రెడ్డి ప్లానింగ్ మాములుగా లేదుగా
హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ మూవీ సక్సెస్ కావడంతో సీక్వెల్ కూడా రాబోతోంది. యానిమల్ పార్క్

దిశ, వెబ్ డెస్క్: రణబీర్ కపూర్, రష్మిక కాంబినేషన్లో వచ్చిన మూవీ యానిమల్. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించారు. తండ్రి కొడుకుల మధ్య కథను చాలా అందంగా తీర్చిదిద్దారు సందీప్ రెడ్డి. 2023 డిసెంబర్ ఒకటో తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ, కోట్ల వర్షం కురిపించింది. ఈ మూవీ 900 కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ మూవీ సక్సెస్ కావడంతో సీక్వెల్ కూడా రాబోతోంది. యానిమల్ పార్క్ పేరుతో ఈ సినిమాను 2027లో సందీప్ రెడ్డి రిలీజ్ చేయనున్నారు. ఇది ఇలా ఉండగా, తాజాగా యానిమల్ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో జపాన్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఫిబ్రవరి 13వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.






