- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anil Sunkara: భోళా శంకర్.. తీసినందుకు నన్ను చూసి క్లర్క్ జాలిపడ్డాడు!
బోళా శంకర్ సినిమా ఎందుకు చేశారని అక్కడ ఉన్న క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడని.... షాకింగ్ నిజాన్ని బయట పెట్టారు

దిశ, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ బోళా శంకర్ పై నిర్మాత అనిల్ సుంకర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాతో నష్టపోయినట్లు ఆయన పరోక్షంగా వెల్లడించారు. ఓ ఈవెంట్ సందర్భంగా... నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ... ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.
తాను ఒక సమయంలో.. ఇన్కమ్ టాక్స్ ఆఫీసుకు వెళ్లానని వెల్లడించారు అనిల్. ఆ సందర్భంగా బోళా శంకర్ సినిమా ఎందుకు చేశారని అక్కడ ఉన్న క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడని.... షాకింగ్ నిజాన్ని బయట పెట్టారు. వేరే కథలు తీయచ్చు కదా అంటూ తనను నిలదీశాడని పేర్కొన్నారు. అయితే.. ఆ సినిమా వల్ల తనకు నష్టం వచ్చిందని... ఒరిజినల్ సినిమా హిట్ అయింది కాబట్టి.... రీమేక్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించాడట.
కానీ బోళా శంకర్ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోతే తానేమి చేయగలను అన్నట్లు క్లర్క్ తో వివరించిన సంఘటనను తాజాగా బయటపెట్టారు అనిల్. దీంతో అనిల్ చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉండగా 2023 సంవత్సరం ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ సినిమా... దాదాపు 50 కోట్ల వరకు మాత్రమే సంపాదించింది. ఈ సినిమాకు ఏకంగా 100 కోట్లు బడ్జెట్ పెట్టారు. క్లిక్






