- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా స్టార్ట్ అయిన అనిల్ మామా మల్టీస్టారర్ ప్రాజెక్ట్.. ఆకట్టుకుంటోన్న ఫొటోస్
వెంకటేష్, కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ నేడు పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ అయింది.

దిశ, సినిమా: బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న మల్టీస్టారర్ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. ఇందులో విక్టరీ వెంకటేష్, కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తుండగా.. కీర్తి సురేష్, కృతిశెట్టి హీరోయిన్స్‌గా అలరించనున్నారు. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ లాంచింక్ ఈవెంట్‌కు దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరుకాగా.. ముహూర్తపు షాట్‌కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఫస్ట్ సన్నివేశానికి దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ మేరకు మొదటి షాట్‌లో విక్టరీ వెంకటేష్ కృతి శెట్టి భుజంపై, కల్యాణ్ రామ్ కీర్తి సురేష్ భుజంపై చేతులు వేసి నుంచోగా.. హీరోయిన్స్ తారుమారు కావడంతో మళ్లీ వెంకటేష్, కీర్తి సురేష్.. కల్యాణ్ రామ్, కృతి శెట్టి పక్కపక్కకు వచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు. ఈ ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది.






