- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్.. ఆ తేదీన గ్రాండ్ లాంచ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ - కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మూవీ జూన్ 18న లాంచ్ కానున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కాగా, సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం. తాజాగా ఈ మూవీ లాంచింగ్ కార్యక్రమానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, జూన్ 18వ తేదీన ఈ చిత్ర లాంచింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రూపొందుతుండడం, వెంకటేష్ - కళ్యాణ్ రామ్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించనుండగా, ఒక హీరోయిన్‌గా కృతి శెట్టిని ఫైనల్ చేసినట్లు సమాచారం.






