- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sankranti vasthunna: ఈ విక్టరీ నా కెరీర్‌లో ఓ హిస్టరీ.. ఇంట్రెస్టింగ్‌గా అనిల్ రావిపూడి కామెంట్స్
విక్టరీ వెంకటేష్ (Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘సంక్రాంతి వస్తున్నాం’

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్ (Venkatesh), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘సంక్రాంతి వస్తున్నాం’ (Sankranti vasthunna). మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhari), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకోవడంతో పాటు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది. దీంతో ప్రజెంట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తు్న్న చత్ర బృందం వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా అనిల్ రావిపూడి మీడియాతో ముచ్చటిస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
ఆయన మాట్లాడుతూ.. ‘ఈ పదేళ్ళు ప్రతి సినిమా ఒక వండర్ ఫుల్ ఎక్సపీరియన్స్. ప్రతి హీరోతో ఒక అద్భుతమైన రిలేషన్. నేను ఏ జోనర్ సినిమా చేసిన ఆడియన్స్ గొప్పగా సపోర్ట్ చేశారు. ప్రతి సినిమాకి ఒకొక్క మెట్టు ఎక్కిస్తూ ఫైనల్‌గా ఈ పొంగల్‌కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో ఓ అద్భుతమైన విజయం ఇచ్చారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విక్టరీ నా కెరీర్‌లో ఓ హిస్టరీ. లక్కీగా ఆడియన్స్ సపోర్ట్‌తో అన్నీ హైపే చూశాను. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో అద్భుతమైన విజయం ఇచ్చిన ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ క్రెడిట్ అంతా ఆడియన్స్‌కే ఇస్తాను. ఇది మామూలు సక్సెస్ కాదు. ఆరు రోజుల్లో వందకోట్ల షేర్, వన్ వీక్‌లో 200 కోట్లు క్రాస్ చేయడం అంటే ఓ అద్భుతం. ఇది నా కెరీర్‌లో హిస్టరీ. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి ఈ బలం ఉందని ఆడియన్స్ చాలా స్ట్రాంగ్‌గా స్టేట్మెంట్ ఇచ్చారని అనిపిస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’కు వస్తున్న కాంప్లిమెంట్స్ చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఫీలౌతున్నాను. 'మా అమ్మ ముఫ్ఫై ఏళ్ల తర్వాత సినిమాకి వచ్చింది' అని ఓ ఫ్రెండ్ ఫోటో షేర్ చేస్తూ మెసేజ్ పెట్టాడు. కొంతమంది వీల్ చైర్‌లో వచ్చీ మరి సినిమా చూశారు. సినిమాకి దూరమైన ఆడియన్స్ మళ్ళీ థియేటర్‌కి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు.






