భగవంత్ కేసరికి జాతీయ అవార్డు.. ఎమోషనలైన అనిల్ రావిపూడి

by velandi.Saikiran |

బాలకృష్ణ హీరోగా చేసిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) మూవీ బంపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ

భగవంత్ కేసరికి జాతీయ అవార్డు.. ఎమోషనలైన అనిల్ రావిపూడి
X

దిశ, వెబ్ డెస్క్: బాలకృష్ణ హీరోగా చేసిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) మూవీ బంపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు... అరుదైన గౌరవం దక్కింది. భగవంత్ కేసరి సినిమాకు... ఉత్తమ జాతీయ చిత్రం అవార్డు దక్కింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే... భగవంత్ కేసరి సినిమాకు అవార్డు దక్కడంపై దర్శకుడు అనిల్ రావిపూడి కూడా స్పందించారు.

తన కెరియర్ లో చేసిన విభిన్న ప్రయత్నమే ఈ భగవంత్ కేసరి సినిమా అంటూ వ్యాఖ్యానించారు అనిల్ రావిపూడి. ఆ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించడం అలాగే జాతీయస్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. ఈ భగవంత్ కేసరి సినిమాను ప్రేక్షకులు ఆదరించడం.. ఆ తర్వాత ముందుకు తీసుకువెళ్లడంలో హీరో నందమూరి బాలయ్య మాకు ఎంతో అండగా నిలబడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇక నందమూరి బాలయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలిపారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇది ఇలా ఉండగా...భగవంత్ కేసరి అక్టోబర్ 2023, 18వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ అలాగే హీరోయిన్ శ్రీ లీల ప్రత్యేక పాత్రలో కనిపించారు. తమన్ మ్యూజిక్ అందించారు.

Next Story