మెగా అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న అనిల్ రావిపూడి.. అప్డేట్‌కు ముహూర్తం ఫిక్స్

by Bhoopathi Nagaiah |

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘మెగా-157’(Mega-157).

మెగా అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న అనిల్ రావిపూడి.. అప్డేట్‌కు ముహూర్తం ఫిక్స్
X

దిశ, సినిమా: మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘మెగా-157’(Mega-157). అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన నయనతార (Nayanthara)హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్, హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఇందులోంచి విడుదలై పోస్టర్స్ అంచనాలను పెంచేశాయి. ఇక మెగా అభిమానులంతా టైటిల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ‘మెగా-157’ మూవీ మేకర్స్ బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్, గ్లింప్స్ రాబోతున్నట్లు వెల్లడించారు. ప్రసాద్ ఐమాక్స్‌లో బిగ్ స్క్రీన్‌పై రేపు ఉదయం 11:25 గంటలకు టైటిల్ రివీల్ చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానులు సూపర్ ఎక్జైటెడ్‌గా ఉన్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story