- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెట్ స్పీడ్‌లో అనిల్ రావిపూడి.. అన్ని పాటలు ఫైనల్
అనిల్ రావిపూడి నెక్స్ట్ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే ఆయన కంపోజ్ చేసిన మూడు పాటలను ఈ దర్శకుడు ఓకే చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాలైనా సరే వేగంగా పూర్తి చేసి, ప్రకటించిన తేదీకే విడుదల చేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రిలీజ్ డేట్ ప్రకటించాడంటే ఆ సమయానికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనిల్ స్టైల్‌గా మారిపోయింది. అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా రూపొందించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది జూన్ లేదా జూలై నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఇక షూటింగ్ మొదలు కాకముందే ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే ఆయన కంపోజ్ చేసిన మూడు పాటలను అనిల్ రావిపూడి ఓకే చేసినట్లు టాక్ వినిపిస్తోంది. వరుసగా సంక్రాంతి బరిలో అనిల్ రావిపూడి సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో, వెంకటేష్ - కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






