ఆ ఐదుగురు డిజాస్ట‌ర్ హీరోల‌కు హిట్ ఇచ్చిన అనిల్ !

by velandi.Saikiran |   (  Updated:2026-01-13 11:56:02  IST  )

పటాస్ సినిమాతో అదరగొట్టిన అనిల్ రావిపూడి, అప్పటి వరకు ఫ్లాప్స్ తో సతమతమవుతున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కు లైఫ్ ఇచ్చాడు.

ఆ ఐదుగురు డిజాస్ట‌ర్ హీరోల‌కు హిట్ ఇచ్చిన అనిల్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే పాపులర్ అవుతున్నారు. వరుసగా హిట్స్ అందుకొని దూసుకు వెళ్తున్నారు దర్శక ధీరులు. తెలుగులో 100% సక్సెస్ రేటు సాధించిన దర్శకులు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఈ లిస్టులో రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, అనిల్ రావిపూడి ఉన్న సంగతి తెలిసిందే. అయితే, 100% సక్సెస్ రేటు ఉన్న అనిల్ రావిపూడి, దాదాపు 5 మంది హీరోలకు ట్రాక్ సెట్ చేశాడు. అప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా హిట్ అందుకొని హీరోలకు లైఫ్ ఇచ్చాడు అనిల్.

ఈ హీరోలకు లైఫ్ ఇచ్చిన అనిల్ రావిపూడి!

పటాస్ సినిమాతో అదరగొట్టిన అనిల్ రావిపూడి, అప్పటి వరకు ఫ్లాప్స్ తో సతమతమవుతున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కు లైఫ్ ఇచ్చాడు. అలాగే ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి, హిట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు రవితేజ. అయినా ప్రయోజనం దక్కలేదు. అలాంటి సమయంలో 2017 సంవత్సరంలో రాజా ది గ్రేట్ లాంటి సినిమా చేసి, రవితేజ కెరీర్ ను మళ్ళీ గాడిలో పెట్టాడు దర్శకుడు అనిల్.

ఇక అటు మెగా హీరో వరుణ్ తేజ్ , విక్టరీ వెంకటేష్ F2 సినిమా కంటే ముందు వరుసగా డిజాస్టర్లు ఎదుర్కొన్నారు. వాళ్ళ ట్రాక్ కూడా సెట్ చేశాడు. ఇక 2024లో సైంధవ్ సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న విక్టరీ వెంకటేష్ కు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ఊపిరి పోసాడు అనిల్. బోళా శంకర్ లాంటి సినిమాతో డిజాస్టర్ చవిచూసిన మెగాస్టార్ చిరంజీవికి ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ట్రాక్ సెట్ చేశాడు. దీంతో అనిల్ పేరు మారుమోగుతోంది.

Read More... ఫస్ట్ డేనే బాస్ కుమ్మేశాడు..! మన శంకర వరప్రసాద్ 1st డే కలెక్షన్స్

Next Story