"వార‌ణాసి" సినిమాపై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్

by velandi.Saikiran |

వారణాసి గ్లింమ్స్ లో ఉన్న ప్రతి షాట్ తనను షాక్ కు గురిచేసినట్లు స్పష్టం చేశారు. ఇందులో ప్రతి ఫ్రేమ్ కూడా టైం

వార‌ణాసి సినిమాపై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్
X

దిశ‌, వెబ్‌డెస్క్‌: ప్రిన్స్ మహేష్ బాబు -జక్కన్న దర్శకత్వంలో వారణాసి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టైటిల్ గ్లింమ్స్‌ రామోజీ ఫిలిం సిటీలో రిలీజ్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై తాజాగా సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసి సినిమాకు హైప్ పెంచే దిశగా ఆయన కామెంట్స్ ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన వారణాసి గ్లింమ్స్ చూసి షాక్ అయిపోయానని వెల్లడించారు ద‌ర్శ‌కుడు అనిల్. వెంటనే మహేష్ బాబుకు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడినట్లు పేర్కొన్నారు అనిల్.

ఆ వారణాసి గ్లింమ్స్ లో ఉన్న ప్రతి షాట్ తనను షాక్ కు గురిచేసినట్లు స్పష్టం చేశారు. ఇందులో ప్రతి ఫ్రేమ్ కూడా టైం ట్రావెలర్ లాగా కనిపించినట్లు వెల్లడించారు. అంత భారీగా క్రియేటివ్ గా ఉంటుందని తాను ఊహించలేకపోయానని, ఎవరు ఊహించని రీతిలో సినిమాను తీస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ రేంజ్ లో క్రియేటివ్ ఐడియాలు రాజమౌళికి మాత్రమే వస్తాయని పేర్కొన్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ బద్దలు కొట్టడం గ్యారంటీ అని అంచనా వేశారు. కాగా ఈ సినిమా 2027 సినిమా రిలీజ్ కానుంది.

Next Story