- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిలాక్స్ అయిపోయిన డైరెక్టర్ అనిల్ రావిపూడి..
దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న మూవీ విడుదల కానుండగా.. డైరెక్టర్ అనిల్ రావిపూడి చిత్ర విశేషాలు పంచుకున్నారు. ‘గతేడాదితో పోలిస్తే కొద్దిగా రిలాక్స్‌గా ఉన్నాను. దానికి కారణం చిరంజీవి గారు. హుక్ స్టెప్ డ్యాన్స్.. నేను, వెంకటేష్ గారు చేసిన హంగామా.. ఒక పాజిటివ్ వైబ్ తీసుకొచ్చేసింది. భీమ్స్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చాడు. ఆట సందీప్ ఎప్పటి నుంచో చిరంజీవి గారి పాటకి కొరియోగ్రఫీ చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమాకి అవకాశం వచ్చింది. అద్భుతమైన కొరియోగ్రఫీ చేశాడు. హుక్ స్టెప్ అనే పదం ఇచ్చింది పాట రాసిన రామజోగయ్య గారే. ఇక భార్యాభర్తల మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారనేది చాలా కొత్త కోణంలో ఈ సినిమాలో చూపించడం జరిగింది. అది కచ్చితంగా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఆ ఎమోషన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కరెక్టే కదా అని ఫీల్ అవుతారు’ అని తెలిపాడు.






