నేను పేపర్ మీద కలం పెట్టలేదు నాయ‌నా..అనిల్ కొత్త సినిమాపై ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |

అనేక రూమర్స్ వస్తున్న నేపథ్యంలో తన కొత్త సినిమాపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు

నేను పేపర్ మీద కలం పెట్టలేదు నాయ‌నా..అనిల్ కొత్త సినిమాపై ప్ర‌క‌ట‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అనిల్ రావిపూడి (Anil Ravipudi).. ఈ పేరు చెబితేనే ఇండస్ట్రీ షేక్ అవుతుంది. ఇప్పటివరకు అనిల్ తీసిన ప్రతి సినిమా బంపర్ హిట్ కావడంతో.. సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోలందరూ అతనితో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెమ్యూనరేషన్ తక్కువ అయినా సరే, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక్క సినిమా పడితే చాలు అని చాలా మంది హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారట. ఏడాదిలో ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి కొత్త సినిమా రావడం, బంపర్ హిట్ అందుకోవడం జరుగుతోంది.

అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో వచ్చి బంపర్ హిట్ అందుకున్నారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ ఈ సినిమా రావడం ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చినట్లైంది. కిందటి సంక్రాంతి సమయంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకున్న అనిల్.. ఈసారి చిరంజీవితో ఇండస్ట్రీని షేక్ చేశాడు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా సక్సెస్ కావడంతో... అనిల్ రావిపూడి తర్వాతి సినిమాపై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేష్, రానా కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతుందని కొంతమంది ప్రచారం కూడా చేశారు.

కొత్త సినిమాపై అనిల్ క్లారిటీ

అనేక రూమర్స్ వస్తున్న నేపథ్యంలో తన కొత్త సినిమాపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. తాను ఇంకా పేపర్ మీద కలం కూడా పెట్టలేదు... కానీ అనేక రూమర్స్ మాత్రం వైరల్ చేస్తున్నారని కౌంటర్ పోస్టర్ పెట్టాడు అనిల్. మీరే కథ ఫిక్స్ చేస్తున్నారు... నటీనటులు, టైటిల్ అన్ని పెట్టేశారు... ఇక మీరే యాక్షన్, కట్ చెప్పేసేయండి అంటూ సెటైర్లు పేల్చారు. మీ ఉత్సాహాన్ని తాను అర్థం చేసుకుంటాను... అతి త్వరలోనే కొత్త సినిమా పైన ప్రకటన చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో అనిల్ రావిపూడి పోస్ట్ పై రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

Next Story