అనిల్ - చిరంజీవి మూవీ టైటిల్ ఇదే.. ఇక నవ్వులే నవ్వులు!

by velandi.Saikiran |

మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) అలాగే అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) సినిమా గురించి సోషల్ మీడియాలో విపరీ

అనిల్ - చిరంజీవి మూవీ టైటిల్ ఇదే.. ఇక నవ్వులే నవ్వులు!
X

దిశ, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) అలాగే అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) సినిమా గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఇప్పటినుంచే జనాలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ( Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరహాలోనే... అనిల్ రావిపూడి అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉంటుందని అంటున్నారు. భార్యాభర్తల కథాంశం ఆధారంగా... పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ సినిమా అని చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే.. ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి... విక్టరీ వెంకటేష్ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు.


దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి అలాగే అనిల్ రావిపూడి... సినిమా టైటిల్ గురించి కొత్త చర్చ మొదలైంది. ఈ సినిమాకు " చిరునవ్వుల పండుగ " ( Chiru navvula panduga ) అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చర్చ జరుగుతోందట. ఈ సినిమా పూర్తిగా కామెడీ జోనర్ లో వస్తున్న నేపథ్యంలో... చిరంజీవి పేరుతో టైటిల్ పెట్టి... సినిమా తీస్తున్నారట అనిల్ రావిపూడి. అంతేకాదు ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story