- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధుబాల బయోపిక్‌లో అనీత్ పడ్డా!
‘సైయారా’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో బాలీవుడ్‌లో ఒక్కసారిగా క్రేజీ బ్యూటీగా మారిపోయింది అనీత్ పడ్డా.

దిశ, సినిమా: ‘సైయారా’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో బాలీవుడ్‌లో ఒక్కసారిగా క్రేజీ బ్యూటీగా మారిపోయింది అనీత్ పడ్డా. అందం, నటనతో యూత్‌ను సైతం మెస్మరైజ్ చేస్తున్న ఈ అమ్మడు వరుస ఆఫర్లు అందుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఓ స్టార్ నటి బయోపిక్‌లో నటించబోతున్నట్లు టాక్. దివంగత నటి మధుబాల బయోపిక్ తెరకెక్కబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఈ బయోపిక్‌లో కియారా అద్వానీ నటిస్తున్నట్లు వార్తలు రాగా.. ఆమె నటించడం లేదని టీమ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ బయోపిక్ క్రేజీ బ్యూటీ అనీత్ పడ్డా దగ్గరకు వెళ్లగా ఆమె ఓకే చెప్పిందట. అంతే కాకుండా.. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే అనీత్ పడ్డా సైన్ కూడా చేసినట్లు బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి సమాచారం. దీనికి సంబంధించి ఇతర వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుండగా.. చిత్రీకరణ త్వరలో ప్రారంభమవుతుంది. తుది తారాగణాన్ని త్వరలో వెల్లడిస్తామని కూడా సమాచారం.






