ఆమె నా హీరో.. అలియా భట్‌పై లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

అహాన్ పాండే (అనన్య పాండే సోదరుడు), అనీత్ పద్దా జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘సైయారా’.

ఆమె నా హీరో.. అలియా భట్‌పై లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: అహాన్ పాండే (అనన్య పాండే సోదరుడు), అనీత్ పద్దా జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా ‘సైయారా’. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో దర్శకుడు మోహిత్ సూరి రూపొందించిన ఈ సినిమా జులై 18న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కొత్త జంట నటించిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే సంచలనం సృష్టించింది.. రిలీజైన రెండు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడతూ దూసుకుపోతుంది. దీంతో అహాన్ పాండే, అనీత్ పద్దాలపై సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే అలియా భట్.. ‘నేను చివరిసారిగా ఇంత అందమైన నక్షత్రాలను ఎప్పుడు చూశానో గుర్తులేదు. మీ ఇద్దరి యాక్టింగ్‌కు నేను ఆశ్చర్యపోయాను. ఇంకా మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేంత అందంగా మీ ఇద్దరు ఉన్నారు’ అంటూ అహాన్, అనీత్‌లపై ప్రశంసలు కురిపించింది. దీనిపై హీరోయిన్ అనీత్ పద్దా స్పందిస్తూ.. ‘మీ ఈ ప్రేమ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. మీ నుంచి వచ్చిన ఈ సపోర్ట్, లవ్ ఒక పెట్టిలో దాచిపెట్టుకుంటాను. ఎందుకంటే.. ఇప్పుడు, ఎప్పుడు, ఎప్పటికీ అలియా భట్ నా హీరో అండ్ ఇన్‌స్పిరేషన్’ అంటూ ఎగ్జైట్‌మెంట్‌గా చెప్పుకొచ్చింది అనీత్ పద్దా. లింక్


Next Story