- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"ఆంధ్రా కింగ్ తాలూకా" సినిమా మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ?
రామ్, తాజాగా ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka)తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా రిలీ

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న రామ్, తాజాగా ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka)తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హీరో రామ్ పోతినేని చేసిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సే కనిపించి అందరిని మెప్పించారు. ఈ సినిమాకు మహేష్ బాబు పచ్చి గొల్ల దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో వచ్చిన ఈ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో ఉపేంద్ర కీలకపాత్రలో కనిపించారు.
రొమాంటిక్ లవ్, ఓ హీరో, అభిమాని చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇందులో ఓ వీరాభిమానిగా సాగర్ పాత్రలో హీరో రామ్ పోతినేని కనిపిస్తారు. అలాగే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ లో ఉపేంద్ర కనిపించి మెప్పించారు. ఇక ఆ హీరో కోసం అభిమానిగా ఉన్న రామ్ ఏం చేస్తాడు? ఉపేంద్ర సినిమాల కోసం రామ్, ఎలాంటి వివాదాల్లో చిక్కుకుంటాడు? చివరికి అతని పరిస్థితి ఏమవుతుంది? అన్నది అద్భుతంగా తీశారు డైరెక్టర్ మహేష్ బాబు. అయితే నవంబర్ 27వ తేదీన రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా థియేటర్ లో రన్ అవుతోన్న ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాలో నటించిన ఉపేంద్ర పాత్రను తొలుత మన తెలుగు హీరోకు ఇవ్వాలని అనుకున్నారట. ఇందులో భాగంగానే నందమూరి బాలకృష్ణకు ఈ కథ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రాజకీయాలు, వరుస సినిమా షూటింగులు ఉన్న నేపథ్యంలో ఈ కథను నందమూరి బాలయ్య వదిలేసుకున్నారట. దీంతో ఉపేంద్ర వద్దకు ఈ కథ వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ కథ చెప్పగానే వెంటనే ఉపేంద్ర కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.






