- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ స్టార్ హీరోయిన్‌లా మారిన యాంకరమ్మ.. సేమ్ అలానే ఉన్నావు ఆంటీ అంటూ కామెంట్స్
బుల్లితెర పై తన యాంకరింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న యాంకర్ స్రవంతి చొక్కారపు(Sravanthi Chokkarapu) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర పై తన యాంకరింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న యాంకర్ స్రవంతి చొక్కారపు(Sravanthi Chokkarapu) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ తన మాటలతో ఆడియన్స్‌ను మంత్ర ముగ్ధులను చేస్తోంది. కేవలం టీ షోలలోనే కాకుండా.. స్టార్ హీరోల ఈవెంట్లలో కూడా రచ్చ చేస్తుంది. తన అందంతోనే కాదు.. మాటలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాకుండా సోషల్ మీడియాలో కూడా రచ్చ రచ్చ చేస్తుంది. అలా పెళ్లయిన ఏమాత్రం తగ్గేదేలే అంటూ హాట్ ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తోంది.
ఈక్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా స్రవంతి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో శంభాజీ మహారాజ్ భార్య మహారాణి యేసుబాయిలా మేకప్ చేసుకుంది. ఇక వీటికి ‘ఛావా తెలుగు ప్రమోషన్స్ కోసం ఇలా రెడీ అయ్యాను’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సేమ్ రష్మిక మందన్న లాగానే ఉన్నావు ఆంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.
కాగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన మూవీ ‘ఛావా’(Chhaava). లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మించారు. ఇందులో రష్మిక శంభాజీ మహారాజ్ భార్య మహారాణి యేసు బాయిలా నటించింది.
ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల అయి బ్లాక్ బస్టర్ టాక్‌తో పాటు కలెక్షన్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.






