కుక్కలను రేప్ చేయించి వ్యాపారం చేస్తున్నారు.. మరోసారి యాంకర్ రష్మి సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

కుక్క‌ల‌ను రేప్ చేయించి వ్యాపారం చేస్తున్నారు అంటూ యాంక‌ర్ ర‌ష్మి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. 20 కంటే ఎక్కువ పెట్ సెంట‌ర్ల‌కు లైసెన్సులు లేవ‌ని అక్రమంగా జ‌రుగుతున్న బ్రీడింగ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది.

కుక్కలను రేప్ చేయించి వ్యాపారం చేస్తున్నారు.. మరోసారి యాంకర్ రష్మి సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: కుక్క‌ల‌ను రేప్ చేయించి వ్యాపారం చేస్తున్నారు అంటూ యాంక‌ర్ ర‌ష్మి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. 20 కంటే ఎక్కువ పెట్ సెంట‌ర్ల‌కు లైసెన్సులు లేవ‌ని అక్రమంగా జ‌రుగుతున్న బ్రీడింగ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది. ఇష్టం వ‌చ్చినట్టు బ్రీడింగ్ చేయ‌డం వ‌ల్ల కుక్క‌పిల్ల‌ను కొనుగోలు చేసి రోడ్ల‌పై విడిచిపెడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. చిన్న‌పిల్ల‌లుగా ఉన్న‌ప్పుడు క్యూట్ గా ఉన్నాయ‌ని కొనుగోలు చేసి వాటి క్యూట్ నెస్ పోయిన వెంట‌నే రోడ్ల‌పై వ‌దిలిపెడుతున్నార‌ని చెప్పింది.

పిల్ల‌లు అడిగారని కొనుగోలు చేసి త‌ర‌వాత రోడ్ల‌పై విడిచిపెట్ట‌వ‌ద్ద‌ని చెప్పింది. ఫైనాన్షియ‌ల్, ఎమోష‌న‌ల్ క‌మిట్మెంట్ ఉంటేనే పెట్ డాగ్స్ కొనుగోలు చేయాల‌ని చెప్పింది. కుక్కుల స్టెరిలైజేష‌న్ కోసం త‌మ జేబుల్లో నుండి రూ.10 నుండి రూ.12వేల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్పింది. అలా తీసుకువ‌చ్చిన కుక్క‌ల‌ను రోడ్ల‌పై వ‌దిలేస్తే వీధి కుక్క‌ల‌కు చూసుకోవాలా బ్రీడ్ ల‌ను చూసుకోవాలా అని ప్ర‌శ్నించింది. ప్ర‌జ‌ల‌కు సివిక్ సెన్స్ ఉండాల‌ని ప్ర‌తిఒక్క‌రూ దీని గురించి ఆలోచించాల‌ని చెప్పింది.

Next Story