Rashmi Gautam: వీల్ చైర్‌లో యాంకర్ రష్మీ.. అవన్నీ మిస్ అయ్యానంటూ పోస్ట్.. ఆందోళనలో ఫ్యాన్స్

by Mallepaka Hamsa |

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautam) జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత పలు షోస్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.

Rashmi Gautam: వీల్ చైర్‌లో యాంకర్ రష్మీ.. అవన్నీ మిస్ అయ్యానంటూ పోస్ట్.. ఆందోళనలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautam) జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత పలు షోస్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అలాగే రష్మీ హీరోయిన్‌గానూ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక అక్కడ అవకాశాలు రాకపోవడంతో మళ్లీ బుల్లితెరకు పరిమితం అయింది. అయితే రష్మీ యాంకర్‌గా కంటే కమెడియన్ సుధీర్‌తో పలు స్కిట్స్ చేసే ఎక్కువ పాపులారిటీ దక్కించుకుందనడంలో అతిశయోక్తి లేదు. వీరిద్దరు కలిసి జంటగా ఎన్నో షోస్ చేశారు. దీంతో అప్పట్లో సుధీర్, రష్మీ ప్రేమించుకుంటున్నారనే పుకార్లు సోషల్ మీడియాను షేక్ చేశాయి. దీనిపై వీరిద్దరు స్పందించకపోవడంతో ఇప్పటికీ వారి ప్రేమ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే రష్మీ నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమెకు అనారోగ్య సమస్య రావడం సర్జరీ చేయించుకున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఆమె బాలీ ట్రిప్‌కు కూడా వెళ్లింది. దీంతో ఈ సమయంలో అవసరమా అని అంతా ట్రోల్స్ చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, రష్మీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేసింది. ‘‘నా అమ్మ జీవితాంతం నన్ను ఇబ్బంది పెట్టే ట్రిప్. రెండు నెలల ముందుగానే ప్లాన్ చేసిన బర్త్ డే ట్రిప్ కానీ అత్యవసర ఆపరేషన్ మమ్మల్ని దానిని రద్దు చేసుకునే స్థాయికి తీసుకెళ్లింది. కానీ చాలా షరతులు, నియమాలు అమలులో పెట్టుకుని వెళ్లాం.ఈత కొట్టకూడదు, డైవింగ్ చేయకూడదు, ఇసుక వేయకూడదు, ATV రైడ్‌లు చేయకూడదు, పూల్ చేయకూడదు, డ్యాన్స్ చేయకూడదు, జంపింగ్ చేయకూడదు అని డాక్టర్ చెప్పారు. నేను స్నానం చేయకూడదని చెప్పడం మర్చిపోయానా. చివరకు నేను ఫ్లైట్ ఎక్కాను. మా ఫ్రెండ్స్ అంతా చాలా ఎక్జైటింగ్‌గా ఉన్నారు’’ అని రాసుకొచ్చింది. అయితే ఇందులో రష్మీ వీల్ చైర్‌లో కూర్చొని కనిపించింది. ఇక అది చూసిన నెటిజన్లు త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

Next Story