Anaswara Rajan: లెహంగాలో నడుమందాలతో ఆకట్టుకుంటున్న ఛాంపియన్ బ్యూటీ

by Pulgam srinivas |   (  Updated:2026-04-16 11:00:34  IST  )

అనస్వర రాజన్ లెహంగాలో అందాల సందడి.. వైరల్ అవుతున్న తాజా ఫోటోలు

Anaswara Rajan: లెహంగాలో నడుమందాలతో ఆకట్టుకుంటున్న ఛాంపియన్ బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ యంగ్ హీరోయిన్ అనస్వర రాజన్ ‘ఉదాహరణం సుజాత’ అనే మలయాళ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళ, హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

ఈ ముద్దుగుమ్మ రోషన్ మేక హీరోగా రూపొందిన ‘ఛాంపియన్’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా ద్వారా ఆమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.

సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈమె లైట్ క్రీమ్ కలర్ లెహంగా ధరించి, తాను వేసుకున్న చున్నీని గాలిలో తిప్పుతూ బ్యాక్ మరియు నడుమందాలు హైలైట్ అయ్యేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఇందులో ఈమె రెండు చేతులకు గాజులు ధరించగా, పెద్ద సైజ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం ద్వారా తన లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకుంది. ఈ అవుట్‌ఫిట్‌లో ఈ బ్యూటీ ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story