చంద్రకళ గుర్తుండి పోతుంది!!

by Sujitha Rachapalli |

‘చాంపియన్’ మూవీతో తెలుగులో లాంచ్ కావడం ఆనందంగా ఉందని తెలిపింది హీరోయిన్ అనస్వర రాజన్. ఇందులో చేసిన చంద్రకళ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని ధీమా వ్యక్తం చేసింది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్నా

చంద్రకళ గుర్తుండి పోతుంది!!
X

దిశ, సినిమా : ‘చాంపియన్’ మూవీతో తెలుగులో లాంచ్ కావడం ఆనందంగా ఉందని తెలిపింది హీరోయిన్ అనస్వర రాజన్. ఇందులో చేసిన చంద్రకళ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని ధీమా వ్యక్తం చేసింది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్నా సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ కాగా ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా హీరోయిన్ అనస్వర రాజన్ సినిమా విశేషాలు పంచుకుంది. ‘వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ లాంటి గొప్ప సంస్థ చేస్తున్న సినిమాతో తెలుగుకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు తెలుగు స్పష్టంగా రాదు. అయినప్పటికీ నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. నా పట్ల ఎంతో కేర్ తీసుకున్నారు. వారి నిర్మాణంలో నా తొలి తెలుగు సినిమా రావడం ఎంతో ఆనందంగా వుంది. అయితే చాంపియన్ డైరెక్టర్ ప్రదీప్, అలాగే యూనిట్లో అందరూ కూడా నాకు భాష విషయంలో ఎంతగానో సపోర్ట్ చేశారు. వాళ్ల సపోర్ట్‌తోనే నేను తెలుగులో డైలాగ్స్ అంత చక్కగా పలకగలిగాను. డైరెక్టర్ గారు ప్రతి పదాన్ని చక్కగా నేర్పేవారు. నేను భాషను పలికిన విధానం ఆడియన్స్‌కు కూడా నచ్చుతుందని భావిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు చాలా గొప్ప మనసున్న ఆడియన్స్. నేను వేరే భాషలో చేసిన సినిమాలు చూసి ఎన్నో అద్భుతమైన సందేశాల్ని పంపారు. తెలుగు ఆడియన్స్ ప్రోత్సాహం నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు తెలుగులో చేస్తున్న నా తొలి సినిమా కూడా అంతే గొప్పగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. గిరగిరా సాంగ్‌కి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. నాకు పర్సనల్‌గా సాంగ్ చాలా ఇష్టం. ఈ పాట షూటింగ్ కూడా చాలా ఎంజాయ్ చేసాము . రోషన్ అద్భుతమైన డాన్సర్. తన నుంచి కొన్ని డ్యాన్సింగ్ మెళకువలు కూడా నేర్చుకున్నాను’ అని తెలిపింది.

Next Story