- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anasuya: మొన్నలా.. ఇప్పుడిలా.. నో గ్యాప్ అంటున్న క్రేజీ యాంకర్
Anasuya: మొన్న హాట్.. ఈరోజు క్లాస్ ఫోటోలతో కట్టిపడేస్తున్న అనసూయ.

దిశ, వెబ్ డెస్క్: తెలుగులో మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్లలో అనసూయ ఒకరు. ఈమె యాంకరింగ్ రంగంలో అద్భుతమైన స్థాయికి చేరుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న తర్వాత సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ నటి కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలను అందుకోవడం, అందులోని నటనకు మంచి ప్రశంసలు దక్కడంతో నటిగా కూడా అనసూయకి చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఓవైపు యాంకరింగ్, మరోవైపు సినిమాలతో చాలా బిజీగా కెరీర్ను కొనసాగిస్తుంది.
ఈమె ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ యాంకర్ రెండు రోజుల క్రితం అదిరిపోయే లుక్లో చీర కట్టుకొని, డిఫరెంట్ బ్లౌజ్ ధరించి తన నడుము అందాలు ప్రదర్శితమయ్యేలా కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది, అవి సూపర్ గా వైరల్ అయ్యాయి.
ఇక తాజాగా ఈమె చీర కట్టులో ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. మొన్న అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలతో హల్చల్ చేసిన అనసూయ తాజాగా డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలతో ఆకట్టుకుంటుంది.
ఈ నటికి పుష్ప సిరీస్ మూవీల ద్వారా ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. దానితో అనసూయ ప్రస్తుతం కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటిస్తోంది. కేవలం బ్యూటీ టీవీ షోలలో, సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా తన అందాలతో కుర్రకారు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.






