anasuya: రొమాంటిక్ క్యాప్షన్‌తో రంగమత్త పోస్ట్.. పట్టు చీరలో టెమ్ట్ చేస్తోన్న ఫొటోలు వైరల్

by Kodari Anjali |   (  Updated:2025-04-25 15:32:54  IST  )

హాట్ యాంకర్ అనసూయ క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

anasuya: రొమాంటిక్ క్యాప్షన్‌తో రంగమత్త పోస్ట్.. పట్టు చీరలో టెమ్ట్ చేస్తోన్న ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: హాట్ యాంకర్ అనసూయ క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ బుల్లి తెరపై యాంకర్ గా కెరీర్ ప్రారంభించి.. వెండితెరై అవకాశాలు దక్కించకుంటోంది. ఏకంగా అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసి భారీ క్రేజ్ సొంతం చేసుకుంటోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప రెండు భాగాల్లో కీలక పాత్రలో నటించి అనసూయ తన ప్రతిభ చాటింది. సునీల్‌కు భార్య పాత్రలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.

గ్లోబర్ స్టార్ నటించిన రంగస్థలం సినిమాలో చరణ్‌కు అత్తగా నటించింది. ఈ మూవీతోనే అనసూయ గ్రాఫ్ ఒక్కసారిగా ఛేంజ్ అయ్యిందని చెప్పుకోవచ్చు. దీంతో హాట్ బ్యూటీగా వరుస అవకాశాలు లభించాయి. ప్రస్తుతం ప్రస్తుతం రంగమత్తకు అన్ని కీలక రోల్‌లోనే అవకాశాలు వస్తున్నాయి. ఇకపోతే ఈ అమ్మడు తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. వెకేషన్స్‌కెళ్లినా ఫొటోలు, వీడియోలు కానీ.. అభిమానులతో పంచుకుంటుంది. అప్పుడప్పడు భర్త, పిల్లలతో సరదాగా గడుపుతోన్న పిక్స్ కూడా షేర్ చేసుకుంటుంది.

ఒక సమయంలో హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. ఒక సమయంలో సంప్రదాయ లుక్ లో దర్శనమిచ్చి.. నెటిజన్ల చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంటుంది. తాజాగా అనసూయ పట్టుచీరలో దర్శనమిచ్చి అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. చూడానికి ఎంతో చక్కగా.. అందంగా ఉంది. ఈ ఫొటోలు పంచుకుని ఈ నటి ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. ‘‘ఏవండోయ్.. ఏంచేస్తున్నాట్టో’’ అంటూ ఓ రొమాంటిక్ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం అనసూయ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story