ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో ట్రోలర్స్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన అనసూయ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

by I. Sairam |

టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో ట్రోలర్స్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చిన అనసూయ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ జబర్దస్త్(Jabardasth) కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. అయితే గత మూడు రోజులుగా దండోరా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ పై కౌంటరిస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు, వీడియోలు షేర్ చేస్తుంది. ఈ క్రమంలో నిన్న చీరలో ట్రెడిషనల్ ఫొటోస్ షేర్ చేయగా.. ఆ పోస్ట్ కింద అందరూ శివాజీ వల్లే ఈమె కూడా చేంజ్ అయిందని.. అది శివాజీ అంటే అని కామెంట్ల వర్షం కురిపించారు.

అయితే శారీ లుక్ త‌ర్వాత అన‌సూయ‌కి చాలా మంది కౌంట‌ర్స్ వేస్తున్న నేప‌థ్యంలో స్విమ్ షూట్ వీడియోని షేర్ చేసి త‌గ్గేదే లే అన్న‌ట్టు బ‌దులిచ్చింది. ఇక ఈ పోస్ట్‌కు ‘నీళ్లలో ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. నా ట్రావెల్ డేస్‌ని చాలా మిస్ అవుతున్నాను. త్వరలోనే ఒక హాలిడే ప్లాన్ చేయాలి’ అని రాసుకొచ్చింది.

ఇక అనసూయ త‌నని ట్రోల్ చేస్తున్నారు కాబ‌ట్టే, ఆమె కావాలనే ఇలా స్విమ్ షూట్‌లో ఉన్న వీడియోని పోస్ట్ చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. దీన్ని చూసిన నెటిజన్లు శివాజీ హీరోయిన్ల గురించి మాట్లాడారని, యాంకర్ల గురించి కాదు కదా ఎందుకు నువ్వంత ఫీలవుతున్నావని, నీ డ్రెస్సింగ్ స్టైల్ చెండాలమని తిట్టిపోస్తున్నారు.

Next Story