- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హయగ్రీవ పూజ చేసిన అనసూయ... ఈ పూజ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా
టాలీవుడ్ యాంకర్ అనసూయ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంట్లో సుగ్రీవపూజ చేసింది. అంతే కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యాంకర్ అనసూయ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంట్లో సుగ్రీవపూజ చేసింది. అంతే కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పండగను సెలబ్రేట్ చేసుకుంది. సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలను యాంకర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అసలు హయగ్రీవ పూజ అంటే ఏంటి? ఆ పూజ చేయడం ద్వారా కలిగే లాభాలు ఏంటి అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. నిజానికి ఈ పూజ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. హయగ్రీవ పూజను ముఖ్యంగా జ్ఞానం, విద్య, బుద్ధి కోసం చేస్తారు. హయగ్రీవుడు హిందూ ధర్మంలో విష్ణుమూర్తి యొక్క ఒక అవతారంగా పరిగణించబడతారు.
హయగ్రీవుడు జ్ఞాన దేవుడిగా పూజించబడతారు. కాబట్టి పరీక్షలలో విజయం ఏకాగ్రత కోసం ఈ పూజ చేస్తారు. అంతే కాకుండా హయగ్రీవుడు వేదాలు, శాస్త్రాల రక్షకుడిగా పరిగణించబడతారు కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం పొందేందుకు భక్తులు ప్రయత్నిస్తారు. వాక్ శక్తి కూడా పెరిగేందుకు హయగ్రీవ పూజ చేస్తారు. హయగ్రీవుడు వాక్కు శక్తి వాగ్దేవితో సంబంధం కలిగి ఉండటం వల్ల స్పష్టమైన ఆలోచనలు, సృజనాత్మకత కోసం ఈ పూజ చేస్తారు. హయగ్రీవుడు దుష్ట శక్తుల నుండి రక్షిస్తాడని, మానసిక శాంతిని, స్థిరత్వాన్ని అందిస్తాడని విశ్వసిస్తారు కాబట్టి ఈ పూజ ద్వారా రక్షణ మరియు శాంతి కలుగుతుందని నమ్ముతారు. ఇక ఈ పూజను సాధారణంగా శ్రావణమాసంలో శ్రావణ పౌర్ణమి రోజు లేదా ఇతర రోజుల్లో చేస్తారు.






