నా పేరు చెప్పుకుని బతుకుతున్నారు.. ఆ అభిమానిపై అనసూయ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-08 12:26:11  IST  )

నటుడు శివాజీ మహిళల వస్త్రాధరణపై చేసిన వ్యాఖ్యల తరవాత అనసూయ వర్సెస్ శివాజీ అన్నట్టుగా వార్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఆ మాటల వేడి ఇంకా చల్లారలేదు.

నా పేరు చెప్పుకుని బతుకుతున్నారు.. ఆ అభిమానిపై అనసూయ సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: నటుడు శివాజీ మహిళల వస్త్రాధరణపై చేసిన వ్యాఖ్యల తరవాత అనసూయ వర్సెస్ శివాజీ అన్నట్టుగా వార్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఆ మాటల వేడి ఇంకా చల్లారలేదు. శివాజీ మాటలతో మొదలై అనసూయ స్పందించడం, తరవాత నా అన్వేషణ తిట్టడం ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ క్రమంలో మురళీ శర్మ అనే ఓ వ్యక్తి మధ్యలో వచ్చి తాను అనసూయ అభిమాని అని చెప్పుకుంటూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అనసూయ ఎక్స్ పోజింగ్ చేస్తే ఆశ్వాదిస్తామని పొట్టిబట్టలు వేసుకోవద్దని చెప్పడానికి మీరు ఎవరు అంటూ డిబేట్ లలో పాల్గొంటున్నాడు.

కాగా తాజాగా ఈ విషయంలో అనసూయ తన సోషల్ మీడియా లైవ్ లో స్పందించింది. అనసూయ పేరుతో పేజీలు, సంఘాలు ఉన్నా తనను కలిసినప్పుడు వారితో చక్కగా మాట్లాడతానని చెప్పింది. వాళ్ల తన ఫోటోలను కలిపి ఆల్బమ్ చేసినప్పుడు పంచుకుంటానని చెప్పింది. కానీ ఇప్పుడు వచ్చిన ఆయన ఎలా వచ్చారో తనకు తెలియని స్పష్టం చేసింది. ఆయన మాటలకు కూడా సమ్మతించనని తేల్చి చెప్పింది. తన పేరు వాడుకుని బతుకుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

READ MORE ....

మహిళల భద్రత గురించి శివాజీ మాట్లాడిన విధానం వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే.. అనసూయ షాకింగ్ కామెంట్స్

Next Story