‘సరైన వ్యవధిలో మూత్ర విసర్జన చేయలేం.. కానీ ఈ పోరాటంలో నాకు ప్రతి ఒక్కటి విలువైనదే’.. అనసూయ పోస్ట్ వైరల్

by Kodari Anjali |

టాలెంటెడ్ నటి అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘సరైన వ్యవధిలో మూత్ర విసర్జన చేయలేం.. కానీ ఈ పోరాటంలో నాకు ప్రతి ఒక్కటి విలువైనదే’.. అనసూయ పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలెంటెడ్ నటి అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటి బుల్లితెరపై తన కెరీర్ స్టార్ట్ చేసి.. ప్రస్తుతం వెండితెరను ఏలుతోంది. ప్రముఖ హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రల్లో అవకాశాలు దక్కించుకుంటూ జనాల్లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమాలతో బిజీ అయిపోయిన ఇప్పుడు ఈమె టీవీ షోలకు దూరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం కూడా అనసూయ పలు సినిమాలతో బిజీగా గడిపేస్తోంది. ఇకపోతే ఇటీవలే ఈ యాంకర్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన విషయాన్ని అనసూయ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అలాగే కొత్త ఇంట్లో మరో శుభకార్యం కూడా నిర్వహించి.. అతిథుల్ని ఆహ్వానించింది.

అనసూయ పెద్ద కొడుకుకు ఉపనయనం కార్యక్రమాన్ని నిర్వహించింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తన కొడుకు శౌర్య భరద్వాజ్‌కు సంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇదంతా పక్కన పెడితే.. అనసూయ తాజాగా నెట్టింట మరో పోస్ట్ పంచుకుంది.

పూర్తిగా సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చి తెలుగు ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకుంది. ఈ పిక్స్ షేర్ చేసి..‘‘సాంప్రదాయకంగా ధరించిన 9 గజాల చీర లాంటిది ఏదీ లేదు. దీనిలో సవాళ్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు 16 గంటల పాటు షూటింగ్ చేయడం.. అలాగే సరైన వ్యవధిలో మూత్ర విసర్జన చేయలేకపోవడం లాంటివి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఈ పోరాటంలో ప్రతి ఒక్కటి నాకు. విలువైనది ఎందుకంటే నాకు ఈ లుక్ గురించి ప్రతిదీ ఇష్టం’’. అని రాసుకొచ్చింది.

Next Story