- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాలిడే టాన్‌లో మునిగి తేలుతూ హాట్ బ్యూటీ పోస్ట్.. మరింత హాట్‌గా ఉన్న మరిన్ని క్లోజప్ షాట్స్ పోస్ట్ చేయండంటూ నెటిజన్ కామెంట్
ప్రస్తుతం వెండితెరను ఏలుతోన్న ప్రముఖ నటి అనసూయ సమ్మర్ హాలీడేస్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం వెండితెరను ఏలుతోన్న ప్రముఖ నటి అనసూయ సమ్మర్ హాలీడేస్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో డైలీ వరుస పోస్టులతో అభిమానుల్ని అలరిస్తుంది. తాజాగా ఈ రంగమత్త ‘‘హాలిడే టాన్‌లో మునిగి తేలుతూ’’ అంటూ ఓ క్యాప్షన్ రాసుకొచ్చి.. టాన్ ఫేస్ ఫొటోలు పంచుకుంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
నువ్వు దగ్గర నుంచి తీసిన ఫోటోలు చూసి నాకు భయం వేసిందని, అద్భుతంగా ఉన్నానంటూ కొంతమంది కామెంట్లు చేయగా.. క్లోజప్ షాట్స్ ఇంకా హాట్ గా ఉన్నాయి, దయచేసి ఇలాంటివి మరిన్ని పోస్ట్ చేయండి అంటూ మరికొంతమంది అంటున్నారు. ఇకపోతే ఈ హాట్ బ్యూటీ భర్తపిల్లలతో సమయం దొరికినప్పుడల్లా వెకేషన్స్‌కు చెక్కేస్తుందన్న విషయం తెలిసిందే. షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్యామిలీకి మాత్రం తప్పకుండా సమయం కేటాయిస్తుంది.
తరచూ పిల్లలు, భర్తలతో కలిసి దిగిన ఫొటోలు కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అభిమానులతో పంచుకుంటుంది. ఇక అనసూయ సినిమాల విషయానికొస్తే... బుల్లితెర నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ నటి ప్రతాపం చూపెడుతోంది. మొదటి సినిమాతోనే తనలోని టాలెంట్ బయటపెట్టి.. అద్భుత నటిగా పేరు దక్కించుకుంది. తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇప్పటికీ ఈ హాట్ బ్యూటీకి ప్రముఖ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి.






