Ananya Pandey: బాలీవుడ్‌లో బిగ్ ఆఫర్ మిస్ చేసుకున్న అనన్యా పాండే?

by Chukka Sudharani |

బాలీవుడ్ (Bollywood) స్టార్ నటుడు చుంకీ పాండే వారసురాలుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే

Ananya Pandey: బాలీవుడ్‌లో బిగ్ ఆఫర్ మిస్ చేసుకున్న అనన్యా పాండే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) స్టార్ నటుడు చుంకీ పాండే వారసురాలుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే (Ananya Pandey). ఇక ‘లైగర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు అనుకున్న స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోలేకపోయింది. దీంతో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా అనన్యాకు నిరాశే ఎదురైంది. తర్వాత టాలీవుడ్‌ (Tollywood)కు దూరమై బాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అక్కడ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఈక్రమంలోనే గతేడాది ‘బాక్ న్యూజ్’తో విజయాన్ని అందుకుంది. ఇక పాత్రలను గురించి పట్టించుకోని ఈ బ్యూటీ.. వచ్చిన ఆఫర్లను ఉపయోగించుకంటూ ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తుంది.

అందులో కార్తీక్ ఆర్య (Karthik Arya) చిత్రం ఒకటి. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ జరుగుతోన్న క్రమంలో.. మరో స్టార్ డైరెక్టర్ ఇచ్చిన చాన్స్ మిస్ చేసుకుందట అనన్య. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్‌గా అనన్యను ఫిక్స్ చేశారట. దీనికి అనన్య కూడా ఓకే చెప్పిందట. కానీ.. ప్రజెంట్ షూటింగ్స్‌లో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరలేదట. దీంతో డైరెక్టర్ ఇంతియాజ్ తన సినిమాను వెయిటింగ్‌లో పెట్టలేనని చెప్పి.. మరో హీరోయిన్‌తో సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు. అతి త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ (Regular shooting) స్టార్ట్ కానుందరి తెలుస్తోంది. దీంతో.. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ కావడంతో.. మంచి చాన్స్ మిస్ చేసుకున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Next Story