గాయాలను మాన్పే ప్రేమ కథ అంటూ రొమాంటిక్ పోస్టర్ షేర్ చేసిన అనన్య పాండే

by Chukka Sudharani |   (  Updated:2026-04-06 14:34:52  IST  )

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే, నటుడు లక్ష్య జంటగా నటించిన సరికొత్త మ్యూజికల్ లవ్ స్టోరీ ‘చాంద్ మేరా దిల్’ .

గాయాలను మాన్పే ప్రేమ కథ అంటూ రొమాంటిక్ పోస్టర్ షేర్ చేసిన అనన్య పాండే
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే, నటుడు లక్ష్య జంటగా నటించిన సరికొత్త మ్యూజికల్ లవ్ స్టోరీ ‘చాంద్ మేరా దిల్’ . ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాను కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. వివేఖ్ సోనీ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా మే 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇక ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా టీజర్ అప్డేట్ ఇచ్చింది అనన్య పాండే. ఈ మేరకు ఓ రొమాంటిక్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘ప్రేమలో 'పిచ్చిగా' ఉండటం అనే భావనను విచ్ఛిన్నం చేస్తూ, గాయాలను మాన్పుతూ, సరికొత్తగా నిర్వచించే ఒక కథ.. చాంద్ మేరా దిల్ టీజర్ 05-04-2026న విడుదల కాబోతున్నది.. వేచి ఉండండి’ అని తెలిపింది.

Next Story