- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ananya Panday: సైన్స్ ఫిక్షన్ సినిమాలో అనన్య.. డైరెక్టర్ ఎవరంటే?
‘లైగర్’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే.

దిశ, సినిమా: ‘లైగర్’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఫస్ట్ మూవీనే డిజాస్టర్ కావడంతో తెలుగులో మరో చిత్రం అనౌన్స్ చేయని ఈ హీరోయిన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఈ ఏడాది ‘కేసరి అధ్యాయం 2’తో అలరించిన ఈమె.. ప్రజెంట్ ‘తు మేరీ మెయిన్ తేరా మెయిన్ తేరా తు మేరీ’, ‘చాంద్ మేరా దిల్’ వంటి సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ బ్యూటీ మరో సినిమాకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత దినేష్ విజయ్ ఒక సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట. ‘చూమంతర్’ అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీలో ‘ముంజ్య’ బ్రేక్అవుట్ అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. అనన్య పాండేను ఫీమేల్ లీడ్‌లో ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ అండ్ రొమాన్స్, కామెడీలను మిళితం చేస్తూ ‘ధక్ ధక్’ హెల్మర్ తరుణ్ దుడేజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. అయితే.. ఈ సినిమాను ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయనప్పటికీ.. సెప్టెంబర్‌లో సన్నాహాలు ప్రారంభమవుతాయి, చిత్రీకరణ ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.






