శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ బ్యూటిఫుల్ ఫొటోలు పంచుకున్న అనన్య నాగళ్ల

by Kodari Anjali |   (  Updated:2025-04-11 12:58:44  IST  )

విభిన్న పాత్రల్లో నటిస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది టాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల (Ananya Nagalla).

శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ బ్యూటిఫుల్ ఫొటోలు పంచుకున్న అనన్య నాగళ్ల
X

దిశ, వెబ్‌డెస్క్: విభిన్న పాత్రల్లో నటిస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది టాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల (Ananya Nagalla). ఈ బ్యూటీ నటించిన చిత్రాలు తక్కువే అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. గతేడాది శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌, తంత్ర, పొట్టేల్, డార్లింగ్ వంటి సినిమాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. అనన్య నాగళ్ల అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకుంది.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్థికంగా కూడా తనకు తోచినంత సాయం చేసి గొప్ప మనసు చాటుకుంది. ఇదంతా పక్కన పెడితే.. అనన్య సోషల్ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ తెలుగమ్మాయి వ్యక్తిగత విషయాల్ని, పర్సనల్ విషయాల్ని ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. తరరూ ఏదో ఒక పోస్టుతో అభిమానుల్ని అలరిస్తుంటుంది. ఒక్కోసారి ట్రెడిషనల్ వేర్‌లో దర్శనమివ్వగా.. ఒక్కోసారి ఒక్కోసారి మోడ్రల్ లుక్‌లో దర్శనమిస్తుంటుంది.

అయితే తాజాగా ఈ బ్యూటీ సంప్రదాయ లుక్‌లో కనిపించి.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. శ్రీరామ నవమి సందర్భంగా అనన్య నాగళ్ల వాయిలెట్ కలర్ శారీ కట్టుకుని దర్శనమిచ్చింది. జడలో పువ్వులు, చెవులకు పెద్ద జుంకాలు ధరించి చిలిపి ఫొటోలకు ఫోజులిచ్చింది. ముఖ్యంగా మెడలో ఆకట్టుకునే హారం హైలెట్‌గా నిలిచింది. ఈ ఫొటోలకు అనన్య ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు’’ అని తెలిపింది. ప్రస్తుతం అద్భుత నటి అనన్య నాగళ్ల లేటెస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.


Next Story