- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ananya Nagalla: పవన్ కల్యాణ్ కుమారుడి గాయంపై స్పందించిన అనన్య నాగళ్ల
తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల గురుంచి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల (Ananya Nagalla) గురుంచి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటి విభిన్న పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. నటించింది కొన్ని సినిమాలు అయినప్పటికీ అనన్య నాగళ్లకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. అతి తక్కువ సమయంలోనే తన టాలెంట్ ను బయటపెట్టింది. అటు సినిమాల్లో నటిస్తూనే ఓ వైపు సోషల్ మీడియాలో కూడా యాక్టిక్ గా ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఫోటో షూట్స్ తో యువతను మెస్మరైస్ చేస్తుంది.
ఇకపోత తాజాగా అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పంచుకుంది. "నా జీవితాన్ని మార్చిన సినిమా వకీల్‌సాబ్‌కి నేటితో 4 సంవత్సరాలు పూర్తయ్యాయాని పంచుకుంది. అలాగే సింగపూర్‌లో మార్క్‌శంకర్ అగ్ని ప్రమాదం గురించి విని చాలా బాధపడ్డానని వెల్లడించింది. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సార్ నా ప్రార్ధనలు మీకు ఎప్పుడూ ఉంటాయి", అంటూ అనన్య నాగళ్ల సోషల్ మీడియా వేదిక రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇన్స్టా స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మల్లేశం సినిమాతో కథానాయికగా పరిచయమైన అనన్య నాగళ్ల.. మిగతా హీరోయిన్లకు భిన్నంగా సినీ రంగంలో రాణిస్తుంది. ఈ బ్యూటీ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఓ భారీ ప్రాజెక్టు కోసం అనన్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.






