Ananya Nagalla: తక్షణమే ఈ బ్లడ్ గ్రూప్ కావాలంటూ ఫోన్ నెంబర్‌తో సహా ఈ డిటైయిల్స్ షేర్ చేసిన నటి

by Kodari Anjali |   (  Updated:2025-04-11 13:23:59  IST  )

విభిన్న పాత్రల్లో నటిస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది టాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల (Ananya Nagalla).

Ananya Nagalla: తక్షణమే ఈ బ్లడ్ గ్రూప్ కావాలంటూ ఫోన్ నెంబర్‌తో సహా ఈ డిటైయిల్స్ షేర్ చేసిన నటి
X

దిశ, వెబ్‌డెస్క్: విభిన్న పాత్రల్లో నటిస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది టాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల (Ananya Nagalla). ఈ బ్యూటీ నటించిన చిత్రాలు తక్కువే అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. గతేడాది శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌, తంత్ర, పొట్టేల్, డార్లింగ్ వంటి సినిమాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. అనన్య నాగళ్ల అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకుంది.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్థికంగా కూడా తనకు తోచినంత సాయం చేసి గొప్ప మనసు చాటుకుంది. ఇదంతా పక్కన పెడితే.. అనన్య సోషల్ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ తెలుగమ్మాయి వ్యక్తిగత విషయాల్ని, పర్సనల్ విషయాల్ని ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. తరరూ ఏదో ఒక పోస్టుతో అభిమానుల్ని అలరిస్తుంటుంది. ఒక్కోసారి ట్రెడిషనల్ వేర్‌లో దర్శనమివ్వగా.. ఒక్కోసారి ఒక్కోసారి మోడ్రల్ లుక్‌లో దర్శనమిస్తుంటుంది.

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ సహాయం కోరింది. ‘‘తక్షణమే నెగటివ్ బ్లడ్ గ్రూప్ దాత అవసరమని వెల్లడించింది. రోగి పేరు: చైతన్య, లింగం: స్త్రీ, ప్రయోజనం: గర్భాశయ శస్త్రచికిత్స, హాస్పిటల్ పేరు: ఆయుష్ హాస్పిటల్, విజయవాడ అని పేర్కొంది. బ్లడ్ గ్రూప్: నెగిటివ్ యూనిట్ రక్తం అవసరమని తెలిపింది. 1 యూనిట్ రక్తం (ప్రత్యక్ష దాత నుంచి మాత్రమే). శస్త్రచికిత్స తేదీ: ఏప్రిల్ 12, 2025 (రక్తాన్ని ఏప్రిల్ 11, 2025న సేకరించాలి). సంప్రదింపు నంబర్: 7337489899, ​​8985853533’’ అంటూ రాసుకొచ్చింది.

Next Story