- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Court Movie: ‘మీరు తెరపై కనిపించిన ప్రతిసారీ నేను నిన్ను మాత్రమే చూస్తున్నాను’: అనన్య నాగళ్ల
సైడ్ క్యారెక్టర్ రోల్స్ చేస్తూ సినీ ఇండస్ట్రీలో రాణిస్తోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల (Ananya Nagalla). వకీల్ సాబ్ చిత్రంతో మరింత ఫేమ్ దక్కించుకుంది ఈ బ్యూటీ.

దిశ, వెబ్‌డెస్క్: సైడ్ క్యారెక్టర్ రోల్స్ చేస్తూ సినీ ఇండస్ట్రీలో రాణిస్తోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల (Ananya Nagalla). వకీల్ సాబ్ చిత్రంతో మరింత ఫేమ్ దక్కించుకుంది ఈ బ్యూటీ. ఇక అప్పటి నుంచి ఈ అమ్మడుకు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. విభిన్న పాత్రల్లో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్‌ను ఏలుతుందని చెప్పుకోవచ్చు.
ఇప్పటి వరకు ఈ అమ్మడు నటించిన ప్రతీ సినిమాల్లో కూడా డిఫరెంట్ క్యారెక్టర్‌తో కనిపించి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందనడంలో అతిశయోక్తలేదు. మల్లేశం, ప్లే బ్యాక్, వకీల్ సాబ్ (Vakil saab), మాస్ట్రో ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లి పెళ్లి, అన్వేషి, డార్లింగ్, తంత్రం, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, పోటెల్ వంటి సినిమాల్లో నటించి అనన్య నాగళ్ల జనాల్ని మెప్పించింది.
ఈ బ్యూటీ నటనలోనే కాదు.. సాయం చేయడంలో కూడా మంచి పేరు సంపాదించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ బ్యూటీ 5 లక్షల రూపాయలు సాయం చేసిన విషయం తెలిసిందే. అలాగే ఓసారి అనన్య హైదరాబాదు బస్టాండ్ వద్ద పడుకున్న పేదలకు దుప్పట్లు కప్పి మరోసారి గొప్ప మనసు చాటుకుంది.
చలికాలం ప్రారంభమవ్వడంలో బస్టాండ్ లో ఉన్న పలువురి ప్రయాణికులకు, పేదలకు స్వయంగా తన చేతితో బస్టాండ్‌లో పడుకున్న వారికి దుప్పట్లు కప్పి గొప్ప మనసు చాటుకుంది. దీంతో ఈ హీరోయిన్‌పై తెలుగు జనాలు పొగడ్తల వర్షం కురిపించారు.
ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా కోర్టు మూవీ వీక్షించింది. కాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ ముద్దుగుమ్మ సినిమా గురించి ఇలా రాసుకొచ్చింది. ‘‘ నిన్నటి ప్యూర్ మ్యాజిక్ సాక్షిగా ఈ సినిమా మన హృదయాల్లో చిరకాలం నిలిచిపోతుంది. నాని సార్ ఇలాంటి కథను మా ముందుకు తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు.
ఒక ప్రియదర్శి మీ కథల ఎంపిక, అత్యుత్తమ ప్రదర్శనలు అన్నీ నాకు చాలా స్ఫూర్తినిస్తాయి. నేను మీ గురించి చాలా గర్వపడుతున్నాను. రోషన్ అండ్ శ్రీదేవి మీ ప్రతిభ, అమాయకత్వం చూడటానికి ఒక ట్రీట్. శివాజీ సార్ మీరు తెరపై కనిపించిన ప్రతిసారీ నేను నిన్ను మాత్రమే చూస్తున్నాను. ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్’’ అంటూ అనన్య నాగళ్ల రాసుకొచ్చింది.






