- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివుడి లింగం వద్ద అనన్య నాగళ్ల క్లాసికల్ డ్యాన్స్.. భక్తిపారవశ్యంతో ఆకట్టుకుంటోన్న వీడియో వైరల్
హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. మల్లేశం సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న అనన్య తర్వాత ప్లే బ్యాక్ అనే చిత్రంతో భారీ విజయం అందుకుంది. అనంతరం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో అవకాశం కొట్టేసి.. ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తంత్ర అనే మూవీలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ చేసి జనాల్ని మెప్పించింది. తర్వాత పొట్టేల్ మూవీలో అవకాశం కొట్టేసింది.
వీటితో పాటు ఈ బ్యూట శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, బహిష్కరణ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించి.. ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పంచుకుంది. క్లాసిక్ డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఈ వీడియోకు ‘‘మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రేరణ కోసం చూస్తున్నట్లయితే, ఇది మీ సంకేతం. అవును మీరు ఏ వయసులోనైనా ఏదైనా నేర్చుకోవచ్చు. మీరు కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఇలా చెబితే నేను మీతో వాదించేదాన్ని. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నేను ఈ విషయాన్ని నమ్ముతున్నాను.
నా గురువుకు కృతజ్ఞతలు తెలుపుతూ నా హృదయాన్ని కదిలించాను.@vennela_samudrala. మీరు లేకుండా ఇది సాధ్యం అయ్చుండేది కాదు. గురువుగారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ప్రొఫెషనల్ డ్యాన్సర్‌ని కాదు, నేను దీన్ని అభిరుచితో చేసాను. కాబట్టి ఏవైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి’’. అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం అనన్య నాగళ్ల క్లాసికల్ డ్యాన్స్ వీడియో నెట్టింట నెటిజన్లను ఆకట్టుకుంటోంది.






