- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ananya Nagalla: ఫ్యాషన్ డిజైనర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించిన అనన్య నాగళ్ల.. ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్‌తో మెయిల్ చేయండని ప్రకటన
హీరోయిన్ అనన్య గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ అనన్య గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. మహిళ ప్రాధాన్యత ఉన్న పాత్రలే కాకుండా.. మరిన్ని పాత్రల్లో కూడా అవకాశాలు దక్కించుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంటుంది.
ఈ బ్యూటీ మల్లేశం చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. తర్వాత ప్లే బ్యాక్ అనే చిత్రంతో భారీ విజయం అందుకుంది. అనంతరం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో అవకాశం కొట్టేసి.. ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తంత్ర అనే మూవీలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది. తర్వాత పొట్టేల్ మూవీలో అవకాశం కొట్టేసింది.
వీటితో పాటుగా ఈ బ్యూటీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, బహిష్కరణ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించి ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడంలో ముందడుగేస్తుంటుంది. ఏపీ, తెలంగాణలో కుండపోత వర్షాలొచ్చి.. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినప్పుడు సాయం చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఈ నటిపై నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపించారు. అతి తక్కువ సమయంలోనే అనన్య నాగళ్ల తెలుగు జనాల గుండెల్లో మంచి స్థానం దక్కించుకుంది. అయితే ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఫ్యాషన్ డిజైనర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ‘‘ ఫ్యాషన్ డిజైనర్ కోసం వెతుకుతున్నాను. 0-6 సంవత్సరాల అనుభవం ఉండాలి. దయచేసి మీ రెజ్యూమ్‌ను [email protected] కు పంపండి. దయచేసి DM చేయవద్దు’’ అని రాసుకొచ్చింది.






