- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ananthika Sanilkumar : క్లాసికల్ స్టెప్పులతో అదరగొట్టిన మ్యాడ్ హీరోయిన్.. నెట్టింట వైరలవుతోన్న వీడియో
టాలీవుడ్ హీరోయిన్ అనంతిక సనిల్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అనంతిక సనిల్‌కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.ఈ నటి తమిళ, కన్నడ చిత్రాలతో బాగా ఫేమస్ అయ్యింది. తర్వాత లాల్ సలామ్ మూవీలో అవకాశం సంపాదించుకుంది. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన తమిళ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించింద. రైడ్, మ్యాడ్ వంటి సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది.
కార్తీక్ దర్శకత్వం వహించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ రైడ్‌లో కూడా తన ప్రతిభ కనబర్చింది. ఇక మ్యాడ్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ 8 వసంతాలు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ కోసం నెటిజన్లు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీకి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ తెలుగు రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈ నెల (జూన్) 20 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ విడుదల కానుంది. ఈ చిత్రంలో అనంతిక ఇంటిమేట్ సినిమాల్లో నటించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు ఇంటిమేట్ సన్నివేశాలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన విషయం తెలిసిందే.
మొదటిసారిగా ఇలాంటి సన్నివేశాల్లో నటిస్తున్నానని వెల్లడించింది. అలాగే కాస్త ఇబ్బందిగా కూడా అనిపించిందని నటి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా క్లాసికల్ డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను మైత్రి మూవీ మేకర్స్ అండ్ అవంతిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ‘‘ప్రతి కదలిక అందంగా ఉంది. క్లాసికల్ స్టెప్పులను ప్రయత్నించండి, @ananthika_sanilkumar గారి గ్రేస్‌ను మ్యాచ్ చేయండి & షేర్ చేయండి. 8వసంతలు జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






