Anant Shri Ram: నేను చెప్పిన మాట జానీ మాస్టర్ విన్నారు.. అందుకే పెద్ది సెకండ్ సింగిల్ అదిరింది

by Pulgam srinivas |

అనంత శ్రీరామ్ మాట్లాడుతూ... పెద్ది చిత్రంలోని రై రై రారా అంటూ సాగే సాంగ్ సాహిత్యం మరియు డ్యాన్స్ విషయంలో సక్సెస్ కావడానికి జానీ మాస్టర్ గారు కారణమని చెప్పారు.

Anant Shri Ram: నేను చెప్పిన మాట జానీ మాస్టర్ విన్నారు.. అందుకే పెద్ది సెకండ్ సింగిల్ అదిరింది
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు లిరిక్స్ అందించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. గత కొంతకాలంగా శ్రీరామ్ కేవలం లిరిక్స్ అందించడం మాత్రమే కాకుండా నటనపై కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. అందులో భాగంగా కొన్ని సినిమాల్లో నటించి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన రై రై రారా అంటూ సాగే సాంగ్ను తాజాగా విడుదల చేశారు. దీనికి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్లోని సాహిత్యానికి, డాన్స్ మూమెంట్స్ కి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ లిరిక్ రైటర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన పెద్ది సినిమాలోని రెండవ సాంగ్ సాహిత్యపరంగా, డాన్సుల విషయంలో సక్సెస్ కావడానికి గల సీక్రెట్ను చెప్పుకొచ్చాడు.

అనంత శ్రీరామ్ తాజాగా మాట్లాడుతూ... రై రై రారా అంటూ సాగే పాట మోటివేషనల్గా ఉంటుంది. దానికోసం పదాలను కూడా అదే స్థాయిలో రాశాను. జానీ మాస్టర్ గారు అద్భుతమైన డాన్స్ స్టెప్స్ కొరియోగ్రఫీ చేస్తారు. ఈ సాంగ్ చిత్రీకరణ స్టార్ట్ అయ్యే ముందు ఆయనకు ఒక విషయం చెప్పాను. ఇందులో మనిషి జీవితం గురించి అనేక పదాలు ఉన్నాయి. ఆ సమయంలో భారీ డ్యాన్స్ మూమెంట్స్ వస్తే మంచిది కాదేమో? మామూలు మ్యూజిక్ వచ్చినప్పుడు డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్పాను. ఆయన కూడా అదే విధంగా చేశారు. ఈరోజు ఈ సాంగ్ అటు సాహిత్యం ఇటు కొరియోగ్రఫీ పరంగా సూపర్ సక్సెస్ అయ్యింది అంటే జానీ మాస్టర్ గారి శ్రద్ధ అందుకు ప్రధాన కారణం అని ఈయన చెప్పుకొచ్చారు.

Next Story