- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ హిట్ కాంబో మరోసారి.. పోస్ట్ వైరల్‌తో ఆనందంలో ఫ్యాన్స్
బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘తేరే ఇష్క్ మే’ పినిమా కాంబో మరోసారి తెరపైకి రాబోతున్నది.

దిశ, సినిమా: బాలీవుడ్‌లో ‘రాన్‌జానా’, ‘అత్రాంగి రే’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘తేరే ఇష్క్ మే’. గతేడాది వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న ఈ మూవీలో ధనుష్, కృతి సనన్ జంటగా నటించారు. ఈ చిత్రం హిట్‌తో ఈ కాంబోపై మంచి బజ్ ఏర్పడింది. ఇందులో భాగంగానే తాజాగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఈ కాంబో మరోసారి తెరపైకి రానున్నట్లు బాలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. అందుతున్న సమాచారం మేరకు.. తేరే ఇష్క్ మే విజయం తర్వాత డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ మరోసారి ధనుష్, కృతి సనన్‌తో ఓ ప్రాజెక్టు తెరకెక్కించాలని ప్లాన్‌లో ఉన్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూరైనట్లు తెలుస్తుండగా.. ధనుష్, కృతి సైతం దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియనప్పటికీ ఈ న్యూస్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.






