- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ రూపంలోకి రావడానికి నాకు ఏడేళ్లు పట్టింది.. బాడీ షేమింగ్‌పై స్టార్ నటి కూతురు ఫైర్
సెలబ్రిటీల పిల్లలుగా పుట్టడం అదృష్టం మాత్రమే కాదు.. ఆ కారణంగా వచ్చే మానసిక వేదనను తట్టుకోవడం కూడా కష్టమే అంటుంది ఓ స్టార్ నటి కూతురు.

దిశ, సినిమా: సెలబ్రిటీల పిల్లలుగా పుట్టడం అదృష్టం మాత్రమే కాదు.. ఆ కారణంగా వచ్చే మానసిక వేదనను తట్టుకోవడం కూడా కష్టమే అంటుంది ఓ స్టార్ నటి కూతురు. ఒకప్పుడు తెలుగు, తమిళంలో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఖుష్బూ సుందర్, దర్శకుడు సుందర్ సి దంపతుల చిన్న కుమార్తె ఆనందిత సుందర్ సినీ రంగంలోకి అడుగు పెట్టి.. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తన సత్తా చాటుకుంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా జేఎఫ్‌డబ్ల్యూ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఈమె.. తను బరువు తగ్గడంపై, బాడీ షేమింగ్‌పై వస్తున్న ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘నేను మా అక్క చిన్నప్పటి నుంచి కాస్త బొద్దిగా ఉండేవాళ్లం. వయసు పెరిగే కొద్దీ ఊబకాయం కారణంగా మేము కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు ఫిట్‌గా మారాలని నిర్ణయించుకుని 2018 నుంచి క్రమం తప్పకుండా వ్యాయామం, డైట్ ఫాల్ అవ్వడంతో సన్నబడ్డాం. ఇప్పుడు ఇలా కనిపిస్తున్న మా మార్పు ఒక్కసారిగా వచ్చింది కాదు.. దాని కోసం ఏడేళ్లు కష్టపడ్డాం. కానీ సోషల్ మీడియాలో పలువరు వాస్తవాలు తెలుసుకోకుండా సర్జరీలు చేయింకున్నాం, ఇంజెక్షన్లు వాడామని ప్రచారం చేస్తున్నారు. మా జీవితాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడం కరెక్టు కాదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.






