Bhairavam : పదహారణాల తెలుగింటి ఆడపడుచులా వెలిగిపోతున్న బ్యూటీ

by Chukka Sudharani |   (  Updated:2024-11-23 13:00:40  IST  )

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్(Nara Rohit) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భైరవం’

Bhairavam : పదహారణాల తెలుగింటి ఆడపడుచులా వెలిగిపోతున్న బ్యూటీ
X

దిశ, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohit) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘భైరవం’(Bhairavam). విజయ్ కనకమేడల డైరెక్షన్‌(Director Vijay Kanakamedala)లో వస్తున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి.. మూవీలో యాక్ట్ చేస్తున్న నటీనటులకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వారి పాత్రలు రివీల్ చేస్తూ విడుదల చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్‌కు నెట్టింట విశేషమైన స్పందన లభిస్తుంది. ఇప్పటికే సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లతో పాటు.. తమిళ నటి అతిధి శంకర్(Athidhi shankar), దివ్యా పిళ్లై(Divya Pillai) ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చెయ్యగా.. తాజాగా మరో బ్యూటీ పోస్టర్ విడుదల చేశారు. ఈ మేరకు ‘మంత్రముగ్ధులను చేసే అద్భుమైన క్యారెక్టర్ యాక్టర్ ఆనంది(Anandi)ని పరిచయం చేస్తున్నాం. తెలిగింటి అందం.. ‘నీలిమ’గా ఆనంది భైరవంలో మీ ముందుకు వస్తోంది. ఆమె తన అద్భుతమైన నటనతో పెద్ద స్క్రీన్‌లను వెలిగిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్టర్‌లో ఆనంది పదహారణాల తెలుగింటి ఆడపడుచులా వెలిగిపోతూ.. ఆడియన్స్‌ను నిజంగానే మంత్రముగ్ధులను చేస్తోంది.


Click Here For Twitter Post..

Next Story