- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anand Sai: తొలిప్రేమలో తాజ్ మహల్ సెట్ ఖర్చుకు నిర్మాత భయపడ్డాడు.. పవన్ వల్లే అది జరిగింది
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మాట్లాడుతూ... 'తొలిప్రేమ'లో తాజ్ మహల్ సెట్ కోసం 14 నుండి 15 లక్షల బడ్జెట్ అవసరం. దాంతో కొత్తవాడినని నా విషయంలో నిర్మాతలు భయపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన పవన్ కళ్యాణ్ చిత్రాల ద్వారా గుర్తింపును సంపాదించుకున్నారు. పవన్ హీరోగా నటించిన తొలిప్రేమ చిత్రానికి ఆయన ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. తాజాగా ఆనంద్ సాయి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తొలిప్రేమ సినిమా సమయంలో జరిగిన ఒక విషయం గురించి చెప్పారు. ఆనంద్ సాయి మాట్లాడుతూ... తొలిప్రేమ సినిమాలో సముద్రం ఒడ్డున తాజ్ మహల్ సెట్ వేయాలి అనుకున్నాం.
దానికి 14 నుండి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పవన్ గారు నన్ను నమ్మి ఆ పని నాకు ఇవ్వాలి అనుకున్నారు. కానీ నిర్మాతలు మాత్రం కొత్తవాడు, ఆయన ఇంత పెద్ద పని చేయగలడా అని అన్నారు. కానీ పవన్ నన్ను నమ్మాడు. నువ్వు అనుకున్న దాని కంటే ఎక్కువ అయితే ఆ డబ్బు నా రెమ్యూనరేషన్ నుండి ఇస్తానని ఆయన అన్నారు. దాంతో నా బాధ్యత మరింత పెరిగింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా 14 నుండి 15 లక్షలు మాత్రమే పారితోషికం ఇచ్చేవారు.
ఆ తర్వాత చాలా కష్టపడి సముద్రం ఒడ్డున తాజ్ మహల్ ఆ సెట్ వేశాను, కానీ అప్పుడు నాకు తెలియలేదు, సెట్ వర్క్ మొత్తం అయ్యాక దాని దగ్గరికి నీరు రావడం మొదలయింది. ఆ సెట్ దగ్గర షూటింగ్ స్టార్ట్ కావడానికి ఇంక రెండు రోజుల సమయం ఉంది. దాంతో మళ్ళీ పవన్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పా. ఆయన నువ్వు ఏం కంగారు పడకు. ప్రార్థన చెయ్యి అన్నాడు. నేను కూడా ఆ సెట్ దగ్గర కూర్చొని ప్రార్థన చేశాను. ఇక ఆ సాంగ్ షూట్ అయ్యాక అలలకి ఆ సెట్ దాదాపు 50 శాతం పోయిందని ఆనంద్ సాయి చెప్పుకొచ్చాడు.






