- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anand Sai: ఆ సినిమా ఫ్లాప్ అని పవన్‌కి ముందే తెలుసు.. అయినా దర్శకుడు అలా అనడంతో చేశాడు
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మాట్లాడుతూ… బంగారం కథ వినగానే అది వర్కౌట్ కాదని పవన్ కళ్యాణ్ ముందే చెప్పాడని వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుల్లో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఒకరు. ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్‌కు ఒక సినిమా కథ వినగానే అది హిట్ అవుతుందా? యావరేజ్ అవుతుందా? అనేది కచ్చితంగా అర్థమవుతుందని చెప్పారు. దాంతో అలాంటి సందర్భం ఏదైనా ఉందా అని అడగగా ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. ఆనంద్ సాయి మాట్లాడుతూ… తమిళంలో రెండు పెద్ద హిట్స్ ఇచ్చిన తర్వాత బంగారం సినిమా దర్శకుడు ధరణి, పవన్ కళ్యాణ్‌కు బంగారం మూవీ కథను వినిపించి దాదాపు ఒక సంవత్సరం పాటు వెయిట్ చేశాడు. కథ పూర్తిగా సిద్ధమైన తర్వాత మళ్లీ వినిపించాడు.
ఆ సమయంలో నేను కూడా ఆయన పక్కనే ఉన్నాను. కథ మొదటి భాగం పూర్తయ్యాక, రెండవ భాగంలో హీరోయిన్ చెల్లెలుతో వచ్చే ఒక సన్నివేశం విషయంలో పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన ఈ కథ వర్కౌట్ కాదు, సెకండ్ హాఫ్‌లో ప్రేక్షకులు డిసప్పాయింట్ అవుతారు, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా ఆడదు అని స్పష్టంగా చెప్పారు. అందుకే ఈ సినిమా చేయకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. అయితే ధరణి గారు చాలా కాలంగా మీతో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారని, ఈ కథ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నమ్మండి అంటూ ఆయన చేతులు పట్టుకుని మరీ కోరారు. దాంతో పవన్ కళ్యాణ్ “ఏదైతే అదవుతుంది” అన్నట్టు చివరకు సినిమా చేశారు. ఈ సంఘటన ద్వారా పవన్ కళ్యాణ్‌కు కథ వినగానే సినిమా ఫలితం ఎలా ఉంటుందో ముందే అంచనా వేయగల సామర్థ్యం ఉందని ఆనంద్ సాయి వెల్లడించారు.






