- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవితేజ - దిల్ రాజు కాంబో మూవీ సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే?
రవితేజ - దిల్ రాజు కాంబోలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌ను ఆగస్టు నెల నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'ఇరుముడి' సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రవితేజ, దిల్ రాజు బ్యానర్‌లో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు నెల నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' చిత్రాన్ని ఆగస్టు 21న విడుదల చేయనున్నారు.
దీంతో ఆ సినిమా పనులన్నీ పూర్తైన తర్వాత దిల్ రాజు బ్యానర్‌లో చేయబోయే కొత్త చిత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక రవితేజ - దిల్ రాజు కాంబినేషన్‌లో రాబోయే ఈ చిత్రానికి 'రాజా రాజా చోర', 'స్వాగ్' వంటి వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన హసిత్ గోలి దర్శకత్వం వహించనున్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.






