- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UK వెళ్లనున్న బేబీ జంట.. వైరల్‌గా పోస్ట్
హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) కాంబినేషన్‌లో వచ్చిన ‘బేబీ’ మూవీ సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) కాంబినేషన్‌లో వచ్చిన ‘బేబీ’ మూవీ సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. మరోసారి వీరి కాంబో రాబోతున్నట్లు రీసెంట్‌గా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, పార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ‘90s వెబ్ సిరీస్’ (90s web series) ఫేమ్ ఆదిత్య హాసన్ (Aditya Haasan) దీనికి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సిరీస్‌కు కొనసాగింపుగా ఈ మూవీ రానుండగా ఇది వరకే ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించబోతున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ జూన్ 9 నుండి హైదరాబాద్‌లో స్టార్ట్ కానుందట. ఈ షూటింగ్ 10 రోజులు పాటు జరగనుందని తెలుస్తుండగా.. దీని తర్వాత జూలైలో UK వెళ్లనున్నారట. అక్కడే మిగతా షూట్ అంతా జరగనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్న టైమ్‌కు కంప్లీట్ అయితే.. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.






