- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు : నవీన్ పొలిశెట్టి
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'.

దిశ, సినిమా : సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక.
భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అనగనగా ఒక రాజు' చిత్రం.. మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకొని.. అసలు సిసలైన పండగ సినిమాలా ఉందని.. 'అనగనగా ఒక రాజు' చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల భారీ వసూళ్లతో సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ప్రేక్షకుల సంపూర్ణ మద్దతుతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం థాంక్యూ మీట్ ని నిర్వహించి, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపింది.
స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. "అందరీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, మాకు మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు పేరుపేరునా కృతఙ్ఞతలు. సితార ఎంటర్టైన్మెంట్స్ అనేది బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్. ఎన్నో మైలురాయి లాంటి చిత్రాలను అందించారు. అలాంటి సంస్థ నుంచి ఇటీవల ఒకట్రెండు సినిమాలు ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇలాంటి తరుణంలో 'అనగనగా ఒక రాజు' రూపంలో ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ ను అందించడం.. మా అందరికీ సంతోషాన్ని కలిగించింది. ముఖ్యంగా నాగవంశీ గారి ముఖంలో చిరునవ్వు చూడటం సంతోషాన్ని ఇచ్చింది. ఆయన ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను.
మా గురువు గారు త్రివిక్రమ్ గారు, చినబాబు గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. త్రివిక్రమ్ గారు, చినబాబు గారు ఈ సినిమా విషయంలో మమ్మల్ని నమ్మి ఎంతగానో ప్రోత్సహించారు. మేము చెప్పింది నమ్మి ఏ ఎపిసోడ్లు అయితే సినిమాలో ఉంచడానికి వారు అంగీకరించారో.. ఇప్పుడు ఆ ఎపిసోడ్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో మొదటి సన్నివేశం నుంచి ఇంటర్వెల్ వరకు ప్రేక్షకులు ఆగకుండా నవ్వుతున్నారు. సెకండ్ హాఫ్ లో పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ కి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. నా సినిమాలలో వినోదానికి పెద్ద పీట వేస్తుంటాను. అయితే ఇందులో వినోదంతో పాటు మంచి భావోద్వేగాలను కూడా అందించాలి అనుకున్నాము. నాకు రాజ్‌కుమార్ హిరానీ గారి సినిమాలంటే ఇష్టం. తెలుగులో అలాంటి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాము. శ్రీరాములు లాంటి ఒక మాస్ థియేటర్లో ఈ సినిమా చూశాం. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ని ఎంతలా ఎంజాయ్ చేశారో, ఎమోషనల్ సీన్లకు అదే స్థాయిలో చప్పట్లు వర్షం కురిపించారు. మా కథ అన్ని వర్గాలు ప్రేక్షకులకు చేరువ అయిందని మాకు అప్పుడే అనిపించింది.
కథానాయకుడిగా నాకిది కేవలం నాలుగో సినిమా. నా మొదటి సంక్రాంతి సినిమా. పోటీలో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మా సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. త్రివిక్రమ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల ఏదో శక్తి ఉందని. నా వెనకున్న శక్తి ప్రేక్షకులే. నా సినిమాలను మోసేది ప్రేక్షకులే. ఒక్క ఛాన్స్ అంటూ తిరిగే నాకు.. వరుసగా నాలుగు విజయాలు అందించిన ప్రతి తెలుగు కుటుంబానికి పేరుపేరునా కృతఙ్ఞతలు. ఇక ముందు కూడా మిమ్మల్ని అలరించడానికి నా శక్తికి మించి కృషి చేస్తాను.
దర్శకుడిగా మారి సహకారం మరువలేనిది. రచనలోనూ తనదైన సహకారం అందించాడు. యాక్సిడెంట్ అయిపోయి ఈ కథ రాస్తున్న సమయంలో నేను కాస్త నిరుత్సాహంతో ఉన్నాను. ఆ సమయంలో మా కో-రైటర్ చిన్మయి నాలో ప్రేరణ నింపింది. మీనాక్షి చౌదరి, రావు రమేష్ గారు అద్భుతంగా నటించారు. అద్భుతమైన సంగీతం అందించిన మిక్కీ జే మేయర్ గారికి ధన్యవాదాలు.
ఒక రైటర్ కి కానీ, ఆర్టిస్ట్ కి కానీ, డైరెక్టర్ కి కానీ నమ్మి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే అవుట్ పుట్ ఇలా ఉంటుంది. మమ్మల్ని నమ్మి మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన నాగవంశీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. సంక్రాంతికి మంచి సినిమా ఇచ్చారు, సినిమా అద్భుతంగా ఉందని.. ఎందరో సినీ ప్రముఖులు మాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా 'అనగనగా ఒక రాజు' చూడనివారు వెంటనే టికెట్ బుక్ చేసుకొని చూడండి. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు." అన్నారు.






