- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిలీజ్ కంటే ముందే బ్రేకులు.. 'అనగనగా ఒక రాజు' మూవీపై షాకింగ్ పోస్ట్
నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న తాజా సినిమా అనగనగా ఒక రాజు ( Anaganaga Oka Raju ). జనవరి 8వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీరాములు థియేటర్ లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.

దిశ, వెబ్ డెస్క్: నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న తాజా సినిమా అనగనగా ఒక రాజు ( Anaganaga Oka Raju ). సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నవీన్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో దూసుకు వెళ్తున్నాడు. ఈ మూవీలో నవీన్ పొలిశెట్టి ( Naveen Polishetty) హీరోగా చేస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా మెరువనున్నారు. ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్ టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా వస్తోంది.
మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ట్రైలర్ రిలీజ్ లాంచ్ ను వాయిదా వేసింది చిత్ర బృందం. జనవరి 7వ తేదీన సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ తాజాగా ఆ తేదీని మార్చుతూ అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. జనవరి 8వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీరాములు థియేటర్ లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.






