- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవీన్ పొలిశెట్టి రికార్డుల మోత..
మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి.. తాజా సంచలన విజయం ‘అనగనగా ఒక రాజు’తో మరో స్థాయికి చేరుకున్నారు.

దిశ, సినిమా : మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి.. తాజా సంచలన విజయం ‘అనగనగా ఒక రాజు’తో మరో స్థాయికి చేరుకున్నారు. ఈ చిత్రం నవీన్ పొలిశెట్టి కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100.2 కోట్ల గ్రాస్‌ను సాధించి.. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. థియేటర్లలో ప్రేక్షకుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ.. ఈ సంక్రాంతి పండుగను మరింత వైభవంగా మార్చింది. సంక్రాంతికి తీవ్ర పోటీ నెలకున్నప్పటికీ.. కేవలం నాలుగు రోజుల్లోనే అన్ని ప్రాంతాల డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్ చేరుకోవడం అరుదైన ఘనత. కాగా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మరో మైలురాయిని నమోదు చేసింది. యూఎస్‌లో నవీన్ పొలిశెట్టి వరుసగా మూడు సినిమాలతో $1 మిలియన్‌కు పైగా వసూళ్లను సాధించిన ఘనతను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ అసాధారణమైన బలం చూపిస్తూ సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది ‘అనగనగా ఒక రాజు’.






